Nitrogen Death: అమెరికాలో సరికొత్త మరణశిక్ష.. నైట్రోజన్‌తో 7 నిమిషాల్లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాషింగ్టన్: ప్రపంచంలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఖైదీకి వినూత్న రీతిలో మరణశిక్ష అమలకు అమెరికా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణశిక్ష అమలు చేసింది. హత్య కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. స్మిత్‌కి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని అమెరికాలోని అలబామా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు అధికారులు నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి స్మిత్‌కు మరణశిక్ష అమలు చేశారు. నైట్రోజన్ సిలిండర్‌కు అమర్చిన పైపును మాస్క్ ద్వారా స్మిత్ ముక్కుకు బిగించి గ్యాస్‌ను విడుదల చేశారు. ఆక్సిజన్ స్థానంలో నైట్రోజన్ పీల్చి 7 నిమిషాల్లోనే స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు.
KCR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదు.. నేతలకు సూచన
Also Read
1988లో బీమా డబ్బుల కోసం తన భార్యను స్మిత్ హత్య చేశాడు. అప్పుల బారినుంచి బయటపడేందుకు కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ కేసులో 1996లో స్మిత్‌కు మరణశిక్ష పడింది. 2022లోనే ఇంజక్షన్ ద్వారా స్మిత్‌కు మరణశిక్ష విధించాలని ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు స్మిత్‌కు నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి ప్రాణాలు తీశారు.
నైట్రోజన్ గ్యాస్‌తో ప్రాణాలు తీయడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ విధానం హింసాత్మకమని పేర్కొంది. అలాగే చివరి వరకు ఈ మరణాన్ని ఆపేందుకు స్మిత్ తరపు న్యాయవాదులు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అలబామా న్యాయస్థానం చూసించినట్టుగానే స్మిత్‌కు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!