వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా విచారణలో ఉండాలని తాను స్పీకర్…
మానవ సేవే.. మాధవ సేవ అని నమ్మి బనగానపల్లె నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు నిస్వార్థ ప్రజా సేవకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో అంతిమ యాత్ర, దహన ప్రక్రియలకు పేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా.. ఉచితంగా శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ తగిన ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన…
నూజివీడు టీడీపీలో పార్థసారధి రచ్చ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నూజివీడు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి.. నూజివీడు సీటు తనకే అని సహకరించాలని ఫోన్ లో కోరారు పార్థసారధి. సారధి ఫోన్ కాల్స్ పై నూజివీడు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరక ముందే సారధి తమ వాళ్ళకు ఫోన్లు చేయటం సరికాదని సూచించారు. సీటు ఏమన్నా ఇస్తే పార్టీ ప్రకటన ఉంటుంది.. అలాంటిది ఏం లేకుండా సారధే చెప్పుకోవటం…
పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటాలియన్ యువ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమము, రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉందని అన్నారు. మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యమని అడిగే దమ్ము జగన్ కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్…
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపి అధిష్టానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నరసరావు పేటకు అనిల్ కుమార్ వెళితే.. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయ్యారు. మొత్తంగా 21 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు బదిలీలు అయ్యారు. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రవీణ్…
రాజకీయాల నుంచి గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆయన ప్రకటించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు జయదేవ్ వెల్లడించారు. తాజాగా ఇదే అంశంపై తల్లి గల్లా అరుణకుమారి స్పందించారు. పార్లమెంట్‌ను గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల శాసించే వారని తెలిపారు. నీతి, నియమాలతో పెరిగిన కుటుంబం తమదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో సీటు కోసం ప్రయత్నం చేస్తే రాలేదని.. అప్పుడు టీడీపీలో జాయిన్ అయినట్లు గుర్తుచేశారు. కేవలం జయదేవ్ కోసమే తామంతా తెలుగుదేశంలో చేరాల్సి…