Chandrababu: విశాఖలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు.
Read Also: Vasupalli Ganesh: స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను..
కాగా.. ఆ వీడియోపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి బూటు కాలుతో తన్నారంటూ మండిపడ్డారు. ఇది న్యాయమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ సిద్ధం సభలో వైసీపీ శ్రేణులు దుర్మార్గంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఫొటో పెట్టి అలాగే చేస్తే పోలీసులు అనుమతిస్తారా అంటూ చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pariksha Pe Charcha: కరోనా కాలంలో చప్పట్లు కొట్టమన్నది అందుకే!.. కారణం చెప్పిన ప్రధాని