రేపు(సోమవారం) స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం రానుంది. కాగా.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాడ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 పరుగులకు ఆలౌటైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసి ఆలౌటైంది.
కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
విజయనగరం జిల్లాకి పూర్వవైభవం తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 వేల మంది రైతులతో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు గలగలా పారే నదులు.. పచ్చని పంట పొలాలతో ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా విలసిల్లేది విజయనగరం. కాల ప్రవాహంలో విజయనగరం తన ప్రభావం కోల్పోయిందని అన్నారు. సహజవనరులు నిరుపయోగం […]
జేడీయూ అధినేత నితీష్‌కుమార్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. బీహార్‌లోనే కాదు దేశంలోనే నితీష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన 8 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అనర్హత వేటుపై రేపు విచారణ జరగనుంది. మండలి చైర్మన్ పంపించిన నోటీసులకు ప్రత్యక్షంగా హాజరై అఫిడవిట్ సమర్పించనున్నారు వంశీ. డిస్‍క్వాలిఫికేషన్ తనకు ఎందుకు వర్తించదో చెప్పేందుకు అవసరమైన సమాధానం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్సీ ఇచ్చే వివరణతో మండలి చైర్మన్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు ఖాయం అవుతుంది. ఒకవేళ అదే సాధ్యమైతే అనర్హత నిర్ణయాన్ని కోర్టులో చాలెంజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ కేంద్రాన్ని దేశ ప్రధాని నరేంద్ర…
జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నితీష్‌కు మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకు మద్దతిస్తున్న మరో ఆరుగురు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం.