భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్లో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా... ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా.. శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 196/2 ఉంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటిస్తున్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉందని.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటిస్తున్న మీరే తమ ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని.. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి చంద్రబాబుకు విజయం బహుమతిగా ఇస్తానని ఆయన…
తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు NAFC యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె్ల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు. ఎండోమెంట్ భూమిపై ఎమ్మెల్యేకు ఉన్న హక్కు…
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 137 రూమ్లో వాళ్లు చనిపోయి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి.. ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్లో నమోదు చేశారు. అయితే పక్కన గదిలో ఉన్న యాత్రికులు దుర్గంధం వస్తుందని ఆలయ అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయట పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఆత్మహత్య చేసుకున్నది ఇద్దరు…
చిన్న పిల్లలకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. చూసేందుకు ఆకర్షణీయంగా, తియ్యగా ఉంటుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా.. పెద్దవారికి కూడా పీచు మిఠాయి అంటే ఇష్టమే.. పీచు మిఠాయిని ఎక్కువగా బీచ్‌లు, పార్కులు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో విక్రయిస్తారు. అయితే ఒకప్పుడు మన ముందే పీచు మిఠాయిని తయారు చేసి ఒక చిన్నపాటి పుల్లకు చుట్టి ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడున్న కాలంలో కవర్లలో పెట్టి అమ్ముతున్నారు.
నోటి పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి ఉంటుంది. నోటిపుండ్లు ఎలాంటి హాని కలిగించకపోయినా వీటి వల్ల నోటికి కొంచెం కారం, పులుపు తగిలినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో కురుపులు రావడానికి గల కారణం.. విటమిన్ 'బి' లోపంతో సహా అనేక కారణాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్ల వల్ల నోటిలో కురుపులు, బొబ్బలు ఏర్పడుతాయి. అయితే…
నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఏపీ పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తించినట్లు తెలిపింది. భోపాల్లో ల్యాబ్ టెస్ట్ కి పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిందని పేర్కొ్న్నారు. కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. చెరువులు, వలస పక్షులు వచ్చే ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రకాశం జిల్లాలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం…
పార్టీ నేతలతో టీడీపీ అధినేతచంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి పనికి వస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నామని చంద్రబాబు…