పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇవ్వనున్నారని ప్రకటించారు. గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ఈ 3 నెలలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో జగన్ జీతం ఇస్తానని చెప్పారంటూ ఎమ్మెల్యే ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. అంతకుముందు కూడా కొన్ని…
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు... వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య తీవ్ర రచ్చ జరుగుతుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తాజాగా.. ఎమ్మె్ల్సీ వంశీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చెంచా గాళ్లు అని అన్నది ఎంవీవీ చెంచా గాల్లని మాత్రమేనని అన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని.. దమ్ముంటే ఎంవీవీ తనతో మాట్లాడాలని అన్నారు. తన గురించి జగన్ తో తప్పుగా చెప్పి బ్యాడ్ చేసాడని తెలిపారు. ఎంవీవీకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా.. నువ్వు ... నేను రాజకీయాలకు…
కాంగ్రెస్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి, అయన చనిపోయాక జగన్ పై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తమ ఇంచార్జీ మంత్రిగా ఉండి, కనీసం తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు, ఆయనకి తన గురించి ఏమీ తెలుస్తుందని రఘువీరా రెడ్డిపై మండిపడ్డారు.
ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంటి మీదకు వచ్చి బెదిరిస్తారు.. తిడతారు.. కొడతారు. కానీ ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తీర్చలేదని బాలుడిని కిడ్నాప్ చేశాడు ఆళ్లగడ్డ వైసీపీ కౌన్సిలర్ వరలక్ష్మి కుమారుడు సుధాకర్. తీసుకున్న అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాల వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ లభించకపోయినా, సమచిత స్థానం కల్పించలేకపోయినా లీడర్లు పార్టీ మారుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఈ క్రమంలో పార్టీ నుంచి అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలైంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం.. రేపు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీన మల్లిఖార్జున ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్ లతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ పార్టీలు నాశనం చేశాయని దుయ్యబట్టారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాలాంటి అంశాలు తమ మేనిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. కాగా.. ఇండియా కూటమితో కలిసి వచ్చే అందరితో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యల పై రఘువీరా రెడ్డి…
టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అర కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, రూ. 10 లక్షల నగదు, హయత్ నగర్‌లో రూ. 3 కోట్ల విలువ చేసే ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు.