విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
2000 ఆన్ లైన్ కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే విద్య అందించాలని ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెలలోనే ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో 1600 వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు.. దానికి సరిపడ అన్ని ఫ్యాకల్టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ 141 ఖాళీగా పోస్టులు ఇటీవలే నియమించామని తెలిపారు.
Pakistan: ప్రస్తుత అధ్యక్షుడు నూతన ప్రధానితో ప్రమాణం చేయించలేరు.. కారణం ఇదే?
అంతేకాకుండా.. 2200 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని.. వాటికి నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి చెప్పారు. అయితే కొందరు కొన్ని సమస్యలపై కోర్టుకు వెళ్లారని.. వాటిని పరిష్కారిస్తామన్నారు. విద్యార్థులను అభివృద్ధి చేసి గోబల్ కాన్ఫరెన్స్ లలో మంచి ప్రెజెంటేషన్ ఇస్తే రాష్ట్రానికి పేరు వస్తోందని మంత్రి అన్నారు. నలభై వేల మందికి వివిధ కంపెనీలలో ఇంట్రెన్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు కోరామని.. ఇందుకు స్టైఫండ్ ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు.. ప్రతి విద్యార్థికి ఆంబీషన్ ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు.