విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47 రోజులుగా ఈ క్రీడలు జరిగాయి.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు జరిగాయని తెలిపారు.
Pawan Kalyan: డైలామాలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు..
క్రీడాకారులకు అవసరమైన కీట్లు ఇచ్చామని.. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశామని సీఎం జగన్ తెలిపారు. అంతేకాకుండా.. ఆడుదాం ఆంధ్రాలో ఐదు క్రీడల్లో 14 మంది క్రీడాకారులను గుర్తించామని సీఎం పేర్కొన్నారు. దాంతోపాుట.. 14 మంది క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. గ్రామస్దాయి నుంచి మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారిని సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేయగలమనేది మరో లక్ష్యమన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి ఐదు రకాల క్రీడల్ని 47 రోజులుగా గ్రామస్దాయిలో పరిచయం చేశామన్నారు. అలాగే విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఇకపై ప్రతీ ఏటా “ఆడుదాం ఆంధ్రా” టోర్నీని నిర్వహిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
Scholarship: కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించిన ఒడిశా సర్కార్