నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఏపీ పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తించినట్లు తెలిపింది. భోపాల్లో ల్యాబ్ టెస్ట్ కి పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిందని పేర్కొ్న్నారు. కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. చెరువులు, వలస పక్షులు వచ్చే ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రకాశం జిల్లాలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా.. ఈ వ్యాధి నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో తప్పా ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యాధి పూర్తిగా అదుపులో ఉంది.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Read Also: Chandrababu: సమయం తక్కువగా ఉంది ప్రతీ ఒక్కరూ సీరియస్గా పని చేయాలి..
కాగా.. మూడు నెలల పాటు చాటగొట్ల పరిసర ప్రాంతాల్లో చికెన్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. చాటగొట్లకు 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాటగొట్లలో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.
Read Also: Vamsi Yadav: దమ్ముంటే నువ్వు గెలువు.. రాజకీయాలకు దూరంగా ఉంటా