ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటిస్తున్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉందని.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటిస్తున్న మీరే తమ ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని.. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి చంద్రబాబుకు విజయం బహుమతిగా ఇస్తానని ఆయన తెలిపారు. ఇది అత్త అల్లుడు మధ్య జరుగుతున్న యుద్ధం కానే కాదు.. ఇది అభివృద్ధి నిరంకుశ పాలన, మంచి చెడుకు జరుగుతున్న ధర్మ యుద్ధం అని అన్నారు. ఈ యుద్ధంలో మంచి ఎప్పుడూ గెలుస్తుందని మాచాని సోమనాథ్ పేర్కొన్నారు.
Ponguleti Srinivas Reddy : ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప.. నాణ్యత గురించి పట్టించుకోలేదు
గత ఐదేళ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది.. సరైన రోడ్లు లేవని మాచాని సోమనాథ్ తెలిపారు. ఇంటింటికి మంచినీరు ఇప్పటికీ అందడం లేదు.. యువతకు సరైన విద్య మరియు ఉద్యోగ అవకాశాలు లేవు.. సంపద సృష్టి జరగట్లేదు అని ఆరోపించారు. అందుకని చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాచాని సోమప్ప ఎలాగైతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సంపద సృష్టించారో.. అదేవిధంగా తాను కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సంపద సృష్టించే కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో P4 సంపద సృష్టించడం అంశం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తానని అన్నారు.
Delhi: ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభం.. ఫ్యూచర్ ప్లాన్ వివరించనున్న మోడీ
P4 అంటే Public, Private, People and Partnership అని చెప్పారు. ప్రజలను అభివృద్ధి విధానంలో ఎలా భాగ్యస్వామ్యం చేయాలి.. సంపదను ఎలా సృష్టించాలి అన్న లక్ష్యాలతో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాచాని సోమప్ప అనేక కోపరేటివ్ సంఘాలను పెట్టి.. ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులను రాష్ట్రాలకు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడున్న ప్రజలకు సంపదను సృష్టించారని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా అదే విధంగా హైదరాబాద్ నగరానికి దేశ విదేశాల నుంచి కంపెనీలను తెచ్చి హైదరాబాద్ ను సాఫ్ట్ వేర్ ఫార్మాసిటికల్ హబ్ గా తయారు చేశారు.. అనేక మందికి ఉద్యోగాలను సృష్టించారు, సంపదను సృష్టించారని సోమనాథ్ తెలిపారు. ఇదే విధానంతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలని.. అలాంటి అభివృద్ధి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తాను చేపడతానన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని వసతులను కల్పించి, ఉద్యోగ అవకాశాలను సృష్టించి సంపదను పెంచడానికి శాయశక్తుల ధారపోసి పని చేస్తానని చెప్పారు.