ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన నడక కోసం అటో కర్రా, ఇటో…
ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడని…
రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేయాలని సీఎం…
రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని తెలిపారు.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, బుమ్రాకు…
ప్రమాదవశాత్తు ఓ హంస ఇనుప కడ్డీలల్లో చిక్కుకుంది. దాని తల అందులో ఇరుక్కుపోయి.. ఎటు రాకుండా ఇబ్బందిపడుతుంది. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని చూసి.. బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు భయం, ఆందోళన కలుగుతుంది. కాగా ఈ వీడియోను @JoshyBeSloshy అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హంస కంచెలోని లోహపు కడ్డీల మధ్య నుంచి బయటకు రాలేకపోవడం చూడొచ్చు.…
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఇలాంటివి నెటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కొంచెం కొత్తదనంగా కనిపిస్తే చాలు.. ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిని పార్టీలోకి తీసుకున్న ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. పార్టీలో పక్క నియోజకవర్గానికి పంపితే చెత్త అంటున్నాడని.. మరి అలాంటి చెత్తను టీడీపీలో చేర్చుకుంటే సెంటా అని నిలదీశారు. మరి అలాంటి చెత్తను మీరు మీ పార్టీలో చేర్చుకుని ఎంత మందిని పునీతులు చేస్తారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరగడంతో.. డెంగీ జ్వరాలేమోనని భయపడుతున్నారు. అంతేకాకుండా.. ఒళ్లు నొప్పులతో కదల్లేకపోతున్నామని నీరసంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు.