ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పెద్దమర్రి వీడు,…
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధికి చిరునామాగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగు శాతం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. మొత్తం 30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది.. గతంలో తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం తక్కువకు పడిపోయిందని తెలిపారు. రావణాసురడి వధ జరిగితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని దుయ్యబట్టారు.
రేపు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. మరో సభ నిర్వహిస్తోంది. కాగా.. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు.
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అతిపెద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషం అని అన్నారు. మరోసారి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని వైవీ స్పష్టం చేశారు. కోర్టులో చిన్న చిన్న అడ్డంకులు ఉండడం వలన పరిపాలన రాజధానిగా విశాఖ ఆలస్యమైందని తెలిపారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.
రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి ఓ రైతు భూమి ఇస్తే నోటీసులు…
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అని అన్నారు. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించాడు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని విమర్శించారు. నీ కుర్చీని…
GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహననౌక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించారు.