ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈరోజు ఖమ్మం రావడం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలవడం సంతోషకరం అని తెలిపారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతుంది అంటే కేసీఆర్ చలువేనని అన్నారు. కేసీఆర్ రాకముందు పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఎంతో ఇబ్బంది పడేవారు.. కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మీ పథకం పెట్టి పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు సులభతరం చేశారని పేర్కొన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. సబ్బండ వర్ణాల ప్రజలను కలుపుకుని ముందుకు పోయిన వ్యక్తి కేసీఆర్ అని కవిత అన్నారు.
Read Also: Pulsar NS125: ఏబీఎస్‌తో బజాజ్ కొత్త పల్సర్ NS125.. ధర ఎంతంటే?
ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యమని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని మండిపడ్డారు. గులాబీ సైనికులు వెంట పడి తరుముతూ సంక్షేమ పథకాలు అమలు చేసేలా చేస్తామని కవిత తెలిపారు. కురచ రాజకీయాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. నీటిని ఉపయోగించుకోవడం లేదు.. రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం, గెలువడం జరుగుతాయి.. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని కవిత పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: త్వరలో సూర్యాపేట, గద్వాల్లో భారీ బహిరంగ సభలు..
రాజకీయంగా టీడీపీ-బీజేపీ పొత్తులో ఉన్నందు వల్ల ఏపీకి అనుమతులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బనకచర్ల పర్మిషన్ ఇస్తే మనకు చాలా నష్టమని అన్నారు. మన కళ్ళ ముందు నీళ్లు వెళుతున్నాయి.. సీఎం స్వంత జిల్లాలో ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆరోపించారు. కేంద్రం అనుమతి లేకుండానే ఆంధ్రాలో ప్రాజెక్టులు కడుతున్నారు.. 199 టీఎంసీ ఏపీకి అనుమతి వస్తే మనకు హక్కులు కోల్పోతాయని అన్నారు. తుమ్మల చాలా సీనియర్.. ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో మనకి తెలుసన్నారు. పోలవరం 7 మండలాల కోసం తాను ఎంతో పోరాటం చేశామని చెప్పారు. సీతారాం ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.