స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. అనేక హామీలు ఇచ్చారు అవి అలాగే ఉన్నాయని తెలిపారు. దీని మీద వివరణ ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళితే బాగుంటుందని కూనంనేని సూచించారు.
Read Also: MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యం
మరోవైపు ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఫ్యూడల్ వ్యవస్థ నుండి బయటకు రావడం లేదు.. అక్షరాస్యత పెరిగేతేనే దేశంలో పురోగతి ఉంటుందని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. ఉచితాలు అంటూ ప్రధాని మోడీ అపహస్యం చేస్తున్నారు.. మోడీ వ్యాఖ్యలు దేశ స్థితిగతులకు అనుగుణంగా లేవని ఆరోపించారు. పరోక్ష టాక్స్ ద్వారా రూ.22 లక్షల కోట్లు వస్తే 90 శాతం పేదలు కడుతున్నారని అన్నారు. బడా బాబులు కట్టిన 10 శాతం దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని వివరించారు.
Read Also: Hamas: ముగ్గురు ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్ హెచ్చరికలు పట్టించుకోని హమాస్
పేదలు కట్టిన జీఎస్టీనే ప్రభుత్వాలకు ఆదాయం, బడ్జెట్ రూపాయల్లో వెళ్తున్నాయని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. పేదలకు ఇస్తే దాన్ని ఉచితాలు అంటారు.. లక్షల కోట్ల రూపాయలను సంపన్న వర్గాలకు చెందిన కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని అన్నారు. ఇండియాలో 1 శాతం మంది చేతుల్లో 45 శాతం సంపద ఉంటే.. మిగతాదంతా పేదల చేతుల్లో ఉందని పేర్కన్నారు. న్యాయమూర్తులు కూడా ఉచితల మీద రాజకీయ నేతల్లాగా మాట్లాడుతున్నారని కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు.