Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
- రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్..
- మార్చి నెలాఖరు నుంచే నిధులు జమ..
- రూ.9 వేల కోట్లు అందజేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త .మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ.. మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
దీనిని రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా రూ. 4,500 కోట్లు.. మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. సన్న వడ్లు పండించే 90 శాతం రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ (IKP), డీసీఎంఎస్ (DCMS) కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్‌కు భారీ స్థాయిలో గ్యాస్..
గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్‌గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!