నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా.. మార్కెట్ చైర్మన్‌ను నిలదీశారు. దీంతో.. పసుపు మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: Payyavula Keshav: రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపులపై మంత్రి పయ్యావుల సీరియస్..
మరోవైపు.. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ర్యాలీగా వచ్చి చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడుతున్నారు. దీంతో.. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Ajith Kumar : అజిత్ 64 డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు.?