Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bird Flu Outbreak In Godavari Districts Lakhs Of Chickens Die

Bird Flu: బుసలు కొడుతున్న బర్డ్ ఫ్లూ.. లక్షలాదిగా కోళ్లు మృత్యువాత

Published Date :February 12, 2025 , 9:53 pm
By Rajesh Veeramalla
  • మొన్న కానూరు.. నిన్న మిర్తిపాడుల్లో వైరస్ ఛాయలు
  • లక్షలాదిగా మృత్యువాత పడిన కోళ్లు
  • ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్ల ఏర్పాటు
  • 64 వైద్య బృందాలతో గ్రామాల్లో సర్వే.
Bird Flu: బుసలు కొడుతున్న బర్డ్ ఫ్లూ.. లక్షలాదిగా కోళ్లు మృత్యువాత
  • Follow Us :
  • google news
  • dailyhunt

బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది. వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది. అటు కోళ్లఫారాలను కట్టడి చేస్తూ.. ఇటు ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల మృత్యువాతకు కారణం బర్డ్‌ఫ్లూ‌ వైరస్ వల్లే అని తేలింది. వేలాదిగా కోళ్లు చనిపోతున్నట్లు భోపాల్‌‌లోని హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. ఇతర దేశాలు, రాష్ట్రాలనుండి కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షుల వల్లే ఈ వైరస్‌ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ కొంత మేరకు స్పష్టత ఇచ్చింది. దీంతో.. బర్డ్ ప్లూ వ్యాప్తి చెందకుండా నిలువరించడానికి జిల్లాలో ఆయా శాఖల అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా ఇతర పక్షి జాతికే కాకుండా.. వీటి గుడ్లు, మాసం తినడం ద్వారా మనుషులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించి, ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించారు. ఎక్కడకక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోపక్క వీటివల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా.. అన్న దశలో కూడా జిల్లా అధికారులు సర్వే చేపట్టారు. ఈ దిశలోనే 64 వైద్య బృందాలు ఆయా ఎఫెక్ట్ గల ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ను కొనసాగిస్తున్నారు. 34 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఈ వైరస్ ను మరింత విస్తరించకుండా కట్టడి చేయడానికి అన్ని శాఖల యంత్రాంగాలు కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయి. జిల్లాలో కోళ్లు మృత్యు వాత పడిన పెరవలి మండలం కానూరు, సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామాల్లో పరిస్థితిపై అధికారులు సమీక్షించారు. సంబంధిత వైరస్ వివరాలు తెలుసుకున్నారు. ప్రజలను భయాందోళనకు గురి కావద్దని సూచించారు. అయితే.. కోళ్లు, వాటి గుడ్లు ద్వారా సంక్రమిస్తున్న ఈ వైరస్ వ్యాధి విషయంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజులపాటు ఆయా ప్రాంతాల్లో చికెన్ తో పాటు కోడిగుడ్లను తినడం పూర్తిగా మానేయాలని హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా.. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కానూరు, మిర్తిపాడు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాను చూసిన తర్వాత బర్డ్ ప్లూ అంటే భయమేస్తుందని చెబుతున్నారు.

Also Read

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..

బర్డ్ ప్లూ వైరస్ ప్రబలకుండా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా హెచ్ఎన్1 -బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణంగా గుర్తించారు. తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారాల నుంచి పంపిన నమూనాలు పాజిటివ్ గుర్తించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు రెండు జిల్లాల్లోని కోళ్ల ఫారాల ప్రాంతాల్లోనే ఈ కోళ్లను పూడ్చి పెట్టారు. బర్డ్ ప్లూ తో చనిపోయిన కోళ్లతోపాటు ఆ ఫారం లో మిగిలిన కోళ్లను కూడా చంపి గోతుల్లో ఉప్పు, సున్నం వేసి పూడ్చి పెడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ వైరస్ కట్టడికి ఆయా ప్రాంతంల్లో కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. పశు వైద్య శాఖ, వైద్య శాఖ అధికారుల సూచనల మేరకు కొన్ని రోజులపాటు గుడ్లు, చికెన్ మాంసాలు తినకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చిన్నారులకు వేసే కోడిగుడ్లు కూడా కొన్ని రోజులపాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుతం గత కరోనా సమయంలో ఎటువంటి ఆందోళన కనిపించిందో.. అదే తరహా ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకి మూడు లక్షలకు పైగా కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో హై అలర్ట్ కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడకక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసారు. ప్రత్యేక జోన్లుగా విభజించి మరీ.. అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీని నివారణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైనా బర్డ్ ఫ్లూ సోకిన లక్షణాలు కనిపిస్తే.. సమాచారం అందించాలని ప్రజలకు వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కోళ్ల ఫారంలకు కిలోమీటరు దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్‌లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రతను బట్టి వైరస్ హెచ్చు తగ్గులు ఉంటాయని, ఈ వైరస్ వలస పక్షులద్వారా వేగంగా వ్యాప్తి చెందిందని పశు సంవర్థక శాఖ అధికారులు భావిస్తున్నారు. మొదట్లో చనిపోయిన వీటిని పూడ్చి పెట్టకుండా బయట పడేయడంతో.. వైరస్‌ మరింత వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే బర్డ్‌ ఫ్లూ వైరస్ జీవించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతున్నందున వైరస్‌ వ్యాప్తి చెందలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పక్క చనిపోయిన కోళ్లకు పరిహారం అందించనున్నట్లు అధికారులు భరోసా ఇస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కోడి ధర 300 రూపాయలు ఉండగా ప్రభుత్వం కోడికి వంద రూపాయలు పరిహారం అందించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అటు పెరవలి, ఇటు సీతానగరం మండలాల్లో ఆయా కోళ్ల ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ మాత్రమే చికెన్ దుకాణాలు మూసివేశారు. వైరస్‌ వ్యాపించిన 10 కిలోమీటర్ల పరిధి లోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. కోడి మాంసంతో పాటు గుడ్ల వాడకాన్ని కొన్ని రోజులపాటు అన్ని ప్రాంతాల్లోనూ తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bird Flu
  • Godavari districts
  • Lakhs Of Chickens
  • Poultry Crisis

తాజావార్తలు

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!

  • Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..

  • LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions