బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది.. ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని తెలిపారు.
రాయలసీమ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నారని.. వారికి పార్టీలు తగిన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే కుర్ణి శాలివాళ్ళకి, తిరుపతిలో అధికంగా ఉండే యాదవులకు, కర్నూల్ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గానికి, అనంతపూరం జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి తగిన ప్రాముఖ్యమైన కలగజేస్తూ పార్టీలు సీట్లను కేటాయించాలని డిమాండ్…
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అందరూ దరఖాస్తు…
తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ వాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని.. 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని దాదాపు 5,36,292…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. మెడ మీద…
రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. అందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలు రేపటి నుండి వచ్చే నెల 2 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 5 యాత్రలు ఉంటాయని అన్నారు. రేపు 4 యాత్రలు ప్రారంభం అవుతాయని.. ఆ తర్వాత కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర తరవాత ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా.. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత…
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 563 పోస్ట్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ -1 రద్దు అయింది.