మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం, డిప్యూటి సీఎం, మంత్రి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరోవైపు.. పలువురు కేంద్ర మంత్రులను కూడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం…
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇద్దరు డీఈలపై వేటు పడింది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఈ గోపాలకృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు సస్పెన్షన్ అయ్యారు. కాగా.. ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర విద్యుత్ సరఫరాలో గోపాలకృష్ణ నిర్లక్ష్యం బయటపడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా గోపాలకృష్ణ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఇంతకుముందు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అలానే కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సస్పెన్షన్…
వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీఈసెట్) - 2024 షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాగా.. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. మొదట మంటలు ఓ గ్యాస్ వెల్డింగ్ షాపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. ఆస్తినష్టం…
హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి జరుగుతోంది. షాదీఖానా పేరుతో మభ్యపెట్టి, కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
శనగలు, బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటాయి. వీటితో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. శనగలు, బెల్లం తీనడం వల్ల దంతాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా.. బెల్లం, శనగలు రెండూ హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. బెల్లం శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. గ్రాము కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బితో…
తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి మాత్రమే ఆవిర్భావ దినోత్సం జరుపుకుంటామని తెలిపారు. 24-02-1130లో నగరానికి జగద్గురు రామానుజాచార్యులు శంఖుస్థాపన చేశారన్నారు. తిరుపతి అంచెలంచెలుగా ఎదుగుతూ మహానగరంగా మారిందని పేర్కొన్నారు.