Rajesh Veeramalla
Author- NTV Telugu-
Tummala Nageswara Rao: రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం..
రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో.. గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా రాష్ట్రములో 75 శాతం సాగు విస్తీర్ణము రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని నివారించి అన్నీ పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా… -
Tribal Welfare Officer: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అరెస్ట్.. రూ.15 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కోటిన్నర రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఫ్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల… -
Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో 10… -
RTC Bus: ఆర్టీసీ బస్సులో గొర్రెపోతులు.. టిక్కెట్ కొట్టిన కండక్టర్
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే.. మేడారం అనగానే గుర్తొచ్చేంది.. తినడం, తాగడం.. అందుకోసమని ఎన్ని డబ్బులు లెక్కచేయకుండా అక్కడికి వెళ్లి కనీసం మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు. -
Elections Schedule: మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..!
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
TS News: రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం..
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
CM Revanth: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలి.. సీఎం విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
Congress vs SP: కాంగ్రెస్-ఎస్పీ మధ్య చర్చలు విఫలం.. మూడు సీట్ల విషయంలోనే..!
ఇండియా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత లోక్‌సభ స్థానాల పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు ఉండదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా..… -
Kishan Reddy: పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా.. ఏం చేయలేక పోయారు
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కృష్ణమ్మ యాత్రను మక్తల్ కృష్ణ గ్రామంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో ఇదే కృష్ణా నుంచి తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవాలి అని శపథం చేస్తూ మళ్లీ ఇక్కడి నుంచే విజయ… -
KCR: త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత.. ఓటమి తర్వాత తొలిసారి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!