లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. నిన్న మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా లేనట్టు రెండు రోజులుగా ఆసుపత్రిలో చేరింది జ్యోతి. ఏసీబీకి పట్టుబడిన వెంటనే అస్వస్థత పేరు చెప్పి ఆసుపత్రిలో చేరిన జ్యోతి.. మొదటగా ఛాతి నొప్పంటూ డ్రామాలు ఆడింది. దీంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నార్మల్ గా రావడంతో కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు.…
స్త్రీలకు పొడవాటి జుట్టు ఉంటే.. అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. పొడవాటి జుట్టుపై ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజుల్లో పొడవాటి జుట్టు కలిగి ఉండే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి గల కారణం.. జుట్టు రాలడం, అకాల నెరసిపోవడం, చుండ్రు ఉండటంతో జుట్టు రాలిపోవడం సమస్యలు వస్తాయి. అంతే కాకుండా పొడి, నిర్జీవమైన జుట్టు కూడా చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. కెమికల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల శిరోజాలు పొడిబారి నిర్జీవంగా…
కొద్దిగా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా వెంటనే వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్.. ఈ ట్యాబెట్ దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే సమస్య తీరిపోతుంది. అయితే దీని వాడకంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడొద్దని.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా సరే డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో వాడకూడదు. పారాసిటామాల్ ను తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, పిరియడ్ క్రాంప్స్ ఇలా రకరకాల సమస్యలకు…
మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి మాయ మాటలు…
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
నిమ్మరసంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఆరోగ్యానికి నిమ్మరసం ఎంత ముఖ్యమో.. నిమ్మ తొక్కలు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. సాధారణంగా పండ్లు, కూరగాయలపై ఉన్న తొక్కలు తీసి పారేస్తాం. కొన్ని కూరగాయల తొక్కలతో పచ్చళ్లు చేసుకుని తింటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం రసం కోసం వాడుతుంటాం. కానీ నిమ్మతొక్క వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ…
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా.. తన కుమారుడికి 'అయాయ్' అని నామకరణం చేశారని తెలిపారు. ఇంతకుముందు కోహ్లీ, అనుష్క దంపతులకు మొదటి సంతానంలో కూతురు వామిక జన్మనిచ్చింది.
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. వెంటనే వారిని…
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా…