టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 563 పోస్ట్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ -1 రద్దు అయింది.
CM Revanth: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..
పేపర్ లీకేజీ కారణంగా నియమ నిబంధనలు పాటించలేదు, బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదు అని పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థులు కోర్టుకి వెళ్లారు. దీంతో.. మళ్ళీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. టీఎస్పీఎస్సీ అప్పీల్ కు వెళ్ళగా.. అప్పుడు సైతం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకే న్యాయస్థానం ఓకే చెప్పింది. దీంతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీంలోనూ సర్వీస్ కమిషన్ కేసును ఉపసంహరించుకుంది. దీంతో సుప్రీం కోర్టు ఓకే చెప్పడంతో గ్రూప్-1 రద్దు చేస్తూ సర్వీసు కమిషన్ నిర్ణయం తీసుకుంది. అన్ని పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి డా. నవీన్ నికోలస్ పేర్కొన్నారు. కాగా.. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
CM Revanth: ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి.. సడన్గా ఎందుకో తెలుసా..!