ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
Read Also: Breaking News: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల..
టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డలి చిన్న రామారావు సమక్షంలో అంబపురం, నైనవరం గ్రామాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, 15 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అంబాపురం గ్రామ నాయకులు (సర్పంచ్) గండికోట సీతయ్య (వార్డు మెంబర్) మడ్లపల్లి వసంత కుమార్, దొండపాటి హరీష్ టీడీపీలో చేరారు. అలాగే.. నైనవరం గ్రామ నాయకులు ధూళిపాల దేవేంద్ర, నిమ్మగడ్డ చిన్న, చాపిరి శ్రీనివాసరావు, పందూరి నూకరాజు, పెయ్యల రవి, సతులూరి సురేష్, సతులూరి కోటేశ్వరరావు, ఆలూరి సతీష్, దూళిపాల నాని, చీదిరాల శివ తెలుగుదేశం పార్టీలో చేరారు.
Read Also: Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం సీరియస్.. కోర్టుకు హాజరుకావాలని అధికారికి ఆదేశం
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు (క్లస్టర్) ఇంచార్జ్ గుజ్జర్లపూడి బాబురావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గరిమెళ్ళ నరేంద్ర చౌదరి, తెలుగు యువత అధ్యక్షులు పరుచూరి నరేష్, అరుసుమిల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.