తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Read Also: Gannavaram: యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరికలు..
అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అయితే.. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపారు. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఈసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు.. ప్రభుత్వం వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ.200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ.120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.