మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని నివారణలు ఉన్నాయి. వాటివల్ల జుట్టు నల్లబడుతుంది..…
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 షూటింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెట్‌లో ఉన్న వ్యక్తులపై మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో చీలమండ గాయం బారిన పడిన పాండ్యా.. టోర్నీ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటూ, తన సోదరుడు కృనాల్, సహచరుడు ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్)తో కలిసి కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ను…
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని జనాలు ఎంతటి దానికైనా తెగబడుతున్నారు. చివరకు చావు అంచుల వరకు కూడా వెళ్లడానికి సిద్ధమనే అంటున్నారు. కొందరేమో భయంకర వీడియోలు చేసి హైలెట్ కావడం కోసం చూస్తే, మరికొందరు మంచి కంటెంట్‌తో హృదయాలను గెలుచుకుంటున్నారు. మరికొందరేమో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా అలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పచ్చిమిర్చి, ఎర్ర కారం పొడిని…
సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అతనికి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేరుంది. తన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సచిన్ ను ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. కాగా.. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఇదిలా ఉంటే.. తన బ్యాట్ తో మొదటిసారి చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 24న క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. అప్పటివరకు…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్‌లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కాగా.. మొదట బ్యాంటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈరోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అయితే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ (30), కుల్దీప్ యాదవ్…
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని…
ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్ సీన్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మెట్రోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు, బికినీలతో ప్రయాణాలు, వింత డ్యాన్స్‌లు వంటివి చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురి చేస్తుంటారు. తాజాగా.. ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. అయితే.. మెట్రోలో ప్రయాణిస్తున్న జనాలు జోక్యం చేసుకోకుండా.. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా సైలెంట్‌గా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన తమ పొత్తు చూసి ఓటు వేయాలని చెబుతున్నారని విమర్శించారు. కాగా.. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.