కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంటే ఇదేనేమో.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. తన పని తాను చేసుకుంటున్న ఏనుగును.. ఓ అమ్మాయి వచ్చి రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో లైక్స్, వ్యూస్ రావాలంటే మరీ వినూత్నంగా ఆలోచించాల్సిన పనిలేదు. కొంతమంది వికృత చేష్టలు వల్ల కూడా లక్షల్లో లైక్‌లు, వ్యూలు వస్తున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలు శాంతియుతంగా ఉన్న జంతువులకు భంగం కలిగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు…
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి…
బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తాగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కాగా.. షణ్ముఖ్ ఇంట్లో ఇప్పటికే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు షణ్ముక్ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఈ బండారం మొత్తం బయటపడింది. షణ్ముఖ్ అతని సోదరుడు…
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు సమ్మక్క మేడారానికి బయల్దేరారు. సమ్మక్కను ఈ…
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేశారు…
వైద్యాశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్లో 2100 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని అల్వాల్లో నిర్మిస్తున్న 1200 బెడ్స్ సామర్ధ్యం కలిగిన టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్బీనగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణ పనుల పురోగతితో పాటు ఎర్రమంజిల్లోని…
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా…
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం ఆనవాయితీ. కానీ.. ఈ సారి అందుకు…
హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, బాలనగర్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, ఉప్పల్, చైతన్యపురి, కోఠిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. బ్లడ్ బ్యాంకుల నిల్వ, రక్త సేకరణ పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు డ్రగ్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వలో పూర్తిగా లోపాలు గుర్తించింది. ఈ క్రమంలో.. 9 బ్లడ్ బ్యాంకులకు…