తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులును…
ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చిన్నచిన్న మనస్పర్ధాలకే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో తొందరపాటు నిర్ణయం వల్ల విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. అంతేకాకుండా.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తే.. భర్త గొడవ ఎందుకులేనని అనుకువుగా ఉన్నా, భార్య మాత్రం ఓ పట్టు పట్టాల్సిందే అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో భార్యల చేతుల్లో చెంపదెబ్బలు, చీపురుదెబ్బలు.. ఇలా రకరకాల దెబ్బలు తినాల్సి వస్తుంది.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దే ఫిజియోథెరఫీ, నర్సింగ్ సేవలు, ట్రీట్మెంట్ తరువాత చేసే వైద్య సేవలు చేయనుంది హెల్త్ ఆన్ అజ్ సంస్థ.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి అని కోరుకునే వాడినని అన్నారు. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని చెప్పారు.…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది.
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి మోడీ ఎంతో సేవ చేశారు.. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా ఇళ్లు,…
తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి. వాటిని ఇంటర్మీడియట్ బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేసింది. కాగా.. ఇంతకుముందు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఉండేది. కానీ తాజాగా.. విద్యార్థులే నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాశ్ని కల్పించింది. అయితే.. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి…
రేపు సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకావడంలేదు. సీబీఐ విచారణకు ఎందుకు రావడం లేదోనని సుదీర్ఘ లేఖ రాసింది కవిత. కాగా.. లిక్కర్ స్కాం కేసులో రేపు తమ ముందు హాజరు కావాలని కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాసింది. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించింది ఎమ్మెల్సీ కవిత. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండని తెలిపారు. ఒకవేళ తన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు, ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన…