రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్‌ఎస్‌కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు బీఆర్ఎస్‌కు రాజీనామా…
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. అందులో భాగంగా ఇంగ్లండ్కు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ టార్గెట్ 192 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 5 వికెట్లు తీసి చెలరేగాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4, జడేజా ఒక వికెట్ సంపాదించాడు. ఇక..…
చికెన్ ధర చూస్తే కెవ్వుమనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో…
బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త నాటకంకు రెండు పార్టీలు తెర లేపారని అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా.. గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజాపక్షం 'ఎడిటర్' గా ఉన్నారు. కాగా.. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
రష్యా-ఉక్రెయిన్ వార్లో 23 ఏళ్ల భారతీయుడు మరణించాడు. ఈ 23 ఏళ్ల యువకుడు గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్‌గా గుర్తించారు. రష్యా సైన్యంలో సెక్యూరిటీ హెల్పర్‌గా చేరాడు. ఈనెల 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మరణించాడని దాడి నుంచి తప్పించుకున్న మరో భారతీయ ఉద్యోగి తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని చెప్పారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు తెలిపారు.