రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కాగా.. మొదట బ్యాంటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈరోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అయితే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ (30), కుల్దీప్ యాదవ్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు..
కాగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఆదిలోనే ఔట్ అయి షాక్ ఇచ్చాడు. గిల్, జైస్వాల్ కాసేపు నిలకడగా రాణించారు. కానీ గిల్ కూడా 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ బ్యాటింగ్ లో రజత్ పాటిధర్ (17), జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14) పరుగులు చేశారు. దీంతో ఓ దశంలో టీమిండియా కష్టాల్లో పడింది. 171 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. కాగా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ స్పిన్నర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమిండియాను దెబ్బతీశారు. ఇంగ్లండ్ బౌలింగ్ లో షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లే 2 వికెట్లు పడగొట్టారు. జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ తీశాడు.