మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని నివారణలు ఉన్నాయి. వాటివల్ల జుట్టు నల్లబడుతుంది.. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో ఉండే ఈ వస్తువులతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
BJP: బీజేపీ బ్యాక్ టూ బ్యాక్ సమావేశాలు.. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు..
రెసిపీని తయారు చేసుకోవడానికి కావాల్సినవి..
అలోవెరా ఆకులు (సన్నగా కట్ చేసుకోండి)
మందార ఆకులు (శుభ్రంగా ఉండాలి)
మందార పువ్వు
కరివేపాకు
2 స్పూన్లు బియ్యం (నీళ్లలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి)
2 స్పూన్లు మెంతులు (నీళ్లలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి)
IPL 2024: ఐపీఎల్ యాడ్ వీడియోలు లీక్.. హార్దిక్, పంత్ యాక్షన్ మాములుగా లేదు
ఈ రెసిపీ చేయడానికి కలబంద, మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, మెంతులు మరియు బియ్యం నీటిని మిక్సర్ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసి అందులోని నీటిని తీయాలి. ఆ నీటిని మీ జుట్టు మూలాలపై రాయాలి. ఈ హెయిర్ టానిక్‌ని జుట్టు మీద అప్లై చేసి 2-3 గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత.. తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. జుట్టు మంచి ఫలితం రావాలంటే.. ఈ టానిక్‌ని వారానికి ఒకసారి అప్లై చేయాలి. అలా 15 రోజుల్లో ప్రభావాన్ని చూస్తారు.