ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్‌లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
ఈ ఘటనపై గురువారం సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజీని పరిశీలించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రెస్టారెంట్ యజమాని ప్రమేయం ఉందని తేల్చారు. బాధితుడు జతిన్‌గా గుర్తించారు. జతిన్.. బుద్ విహార్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. జతిన్‌ను రక్షించే ప్రయత్నంలో అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “జతిన్, రెస్టారెంట్ వర్కర్ మధ్య ఏదో సమస్యపై మనస్పర్థలు వచ్చాయని.. దీంతో, జతిన్ మరియు రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదానికి దారితీసింది, ఆ తర్వాత సిబ్బంది జతిన్ ఛాతీపై కత్తితో పొడిచారు. అంతేకాకుండా.. అడ్డుకోబోయిన అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయి”. అని తెలిపారు.
ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి జతిన్ తన స్నేహితులతో కలిసి పితంపురలోని వర్దమాన్ మాల్‌లో పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “కత్తిపోటుకు గురైన తర్వాత, జతిన్‌ను హడావిడిగా ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు, తెల్లవారుజామున 3.27 గంటలకు, పిసిఆర్‌కి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం గురించి కాల్ వచ్చింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించిన బృందం స్థానిక సమాచారాన్ని సేకరించి సాక్షుల నుంచి తగు విచారణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారి తెలిపారు.
Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. పవన్‌పై మంత్రి కొట్టు సెటైర్లు