గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని…
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు... ప్రజలకు సేవ చేయడమే కాదు... లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్ రెడ్డి పాటుపడుతున్నారు.
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప విజయమే అంటుందని విమర్శించారు. 146 మంది…
మూత్రపిండాల మార్పిడి విషయంలో విప్లవాత్మకమైన ముందడుగుకు, గుణాత్మకమైన విధానాలకు మనదేశంలో శ్రీకారం చుడుతూ.. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ వారు 'పి.కె.డి' అనే రిజిస్ట్రీ పద్ధతిని ప్రవేశపెడుతున్నారని స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం తెలియజేశారు. 'పి.కె.డి' అంటే - 'కిడ్నీ పెయిర్డ్ డొనేషన్' అని అర్థం. మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధితో బాధపడుతున్న లక్షలాది రోగులకు ఈ 'పి.కె.డి' రిజిస్ట్రీ పద్ధతి గొప్ప వరప్రసాదం కాగలదనీ వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే - స్టార్ హాస్పిటల్స్ వారు 'కిడ్నీ స్వాప్…
ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి 2021లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త విపరీతమైన ప్రేమగా మారింది. అయితే వైభవ్.. ఆ యువకుడిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా అయితే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వైభవ్ మాట…
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది.. అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. మరోవైపు.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో…
ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.