దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాకుండా.. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఉపేంద్ర సింగ్ రావత్ పేరు ఉంది. అయితే.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ట్వీట్ లో తెలిపారు. తనకు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై స్పందిస్తూ.. వైరల్ అయిన వీడియో ఎడిట్ చేశారని.. డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను తయారు చేసినట్లు ఎంపీ తెలిపారు.
తమిళనాడులో కిడ్నాపర్ అనే అనుమానంతో వలస కూలీపై దాడి చేశారు స్థానికులు. ఈ ఘటన తిరువళ్లూర్‌లోని పరికపటు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వలస కూలీ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ రోడ్డుపై ఆడుకుంటున్న కొంతమంది పిల్లలతో మాట్లాడాడు. అయితే.. అతను కిడ్నాపర్ అనే అనుమానంతో గ్రామస్తులు అంతా కలిసి అతన్ని చుట్టు ముట్టారు. బాధితుడిని అక్కడ ఉన్న వారంతా చితకబాదారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమయమే చెబుతుందని బీజేపీకి చెందిన పవన్ సింగ్ అన్నారు. అసన్‌సోల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని పవన్ కలిశారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నిరాకరించిన పవన్ సింగ్.. సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏది జరిగినా మంచి జరుగుతుందని పేర్కొన్నారు.…
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి తల ప్రమాదవశాత్తూ బిందెలో ఇరుక్కుపోయింది. దీంతో 5 గంటల పాటు నరకయాతన పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఓ పశువుల పాకలోకి ఆహారం కోసమని వచ్చిన చిరుత.. ప్రమాదవశాత్తు తల బిందెలో ఇరుక్కు పోయింది. కాగా.. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు. టార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాన్ని సోమ్‌నాథ్ బయటపెట్టారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదు, దాని గురించి స్పష్టమైన అవగాహన లేదని పేర్కొన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది. 2023 వరల్డ్ కప్ సాధించడంలో కీలక…
2 దశాబ్దాలుగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజల సేవకు టీడీపీ అంకితమైన కుటుంబం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి సర్పంచ్‌గా బనగానపల్లె పట్టణ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార వేత్తంగా పేరుగాంచిన బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కరువు ప్రాంతమైన బనగానపల్లెలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తొలిసారే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ఓడించి,…
పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో రేపు కొత్త నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 43 వేల మంది భద్రతా బలగాలు బలయ్యారని తెలిపారు. పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగిలిందని అన్నారు. నేడు దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని.. ఈ రోజు పాకిస్తాన్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన సైనికుల్ని చంపిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే మట్టుబెట్టాలని మోడీ ఆదేశించారని.. ఉగ్రవాదుల్ని పాక్…