బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాకుండా.. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఉపేంద్ర సింగ్ రావత్ పేరు ఉంది. అయితే.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ట్వీట్ లో తెలిపారు. తనకు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై స్పందిస్తూ.. వైరల్ అయిన వీడియో ఎడిట్ చేశారని.. డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను తయారు చేసినట్లు ఎంపీ తెలిపారు.
Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్.. ఎంపీగా పోటీ
ఈ విషయాన్ని ఎంపీ ఉపేంద్ర రావత్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను నిర్దోషి అని నిరూపించుకునే వరకు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఇదిలా ఉంటే.. అసభ్యకర వీడియో వైరల్ కావడంతో ఎంపీపై కూడా కేసు నమోదు చేశారు. కాగా.. దీనిపై విచారణ జరిపించాలని రావత్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. నేను నిర్దోషి అని రుజువు అయ్యేంత వరకు ప్రజా జీవితంలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు.
मेरा एक एडिटेड वीडियो वायरल किया जा रहा है जो DeepFake AI तकनीक द्वारा जेनरेटेड है, जिसकी FIR मैंने दर्ज करा दी है,इसके संदर्भ में मैंने मा॰ राष्ट्रीय अध्यक्ष जी से निवेदन किया है कि इसकी जाँच करवायी जाये। जबतक मैं निर्दोष साबित नहीं होता सार्वजनिक जीवन में कोई चुनाव नहीं लड़ूँगा
— Upendra Singh Rawat (@upendrasinghMP) March 4, 2024
Tamil Nadu: కిడ్నాపర్ అనే అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదిన స్థానికులు.. తమిళనాడులో ఘటన
ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి దినేష్ చంద్ర రావత్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆదిత్య త్రిపాఠి తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎంపీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు వ్యక్తులు ఈ దారుణ చర్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వైరల్ వీడియోలో.. ఓ వ్యక్తి మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్నది తానే అని ఎంపీ ఖండించారు.. ఇది ఫేక్ అని అన్నారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. 2019లో పార్టీ అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంకా సింగ్‌ను కాదని, రావత్‌కు టికెట్ ఇచ్చింది. తాజాగా మరోసారి ఆయనవైపే అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.