హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో.. అన్ని ఫైళ్లను అధికారులు…
హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జాడే శాండర్సన్ సందర్శించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ సంస్థల మధ్య స్కిల్లింగ్ రంగంలో సహకారానికి అవకాశాల కోసమే ఈ సందర్శన లక్ష్యం. ఈ సందర్భంగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యూహాత్మక సలహాదారు (ఇండియా) డాక్టర్ పాడీ రామనాథన్.. ఆరోగ్య నైపుణ్యంలో సంభావ్య సహకార మార్గాలను వెల్లడించారు. అంతేకాకుండా.. పిల్లల సంరక్షణలో అత్యుత్తమ కేంద్రంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను గుర్తించాలని సూచించారు. ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జేడ్ శాండర్సన్…
ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.
టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు కలిశారు. టీడీపీకి సంబంధించి టిక్కెట్ల ప్రకటన అనంతరం నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచిస్తున్నారు. సీటు రాలేదు అంటే.. పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చెబుతున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధినేత నేతలకు వివరించారు. ఈ క్రమంలో.. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల గెలుపుకు పని చేస్తామని పలువురు నేతలు…
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గూడూరు నాగేశ్వర్ రెడ్డి,…
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2500 మందితో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. వచ్చే 45 రోజులు చాలా కీలకమని అన్నారు. విరామం లేకుండా…
ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని…
స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఏడాది క్రితమే తమను వైసీపీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేసే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారో.. ఆ రోజు ఈ చర్య తీసుకుని ఉంటే ప్రజలు హర్షించేవారని చెప్పారు. ఈ చర్యలతో వాళ్లు సాధించిందేమీ లేదని.. తమకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.