Kishan Reddy: అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కాంగ్రెస్ దందా మొదలు పెట్టింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 43 వేల మంది భద్రతా బలగాలు బలయ్యారని తెలిపారు. పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగిలిందని అన్నారు. నేడు దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని.. ఈ రోజు పాకిస్తాన్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన సైనికుల్ని చంపిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే మట్టుబెట్టాలని మోడీ ఆదేశించారని.. ఉగ్రవాదుల్ని పాక్ గడ్డమీదే తుదిముట్టించిన ఘనత మోడీది అని కిషన్ రెడ్డి తెలిపారు.
Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
రాష్ట్రంలో.. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కాంగ్రెస్ దందా మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. బిల్డర్లను పిలిచి రాహుల్ గాంధీ ముఠా వందల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి ఎంపీ ఎన్నికలకు పంపిస్తున్నారని.. వంద రోజుల్లోనే ఢిల్లీ సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్‌ఎస్ నేతలు వేల కోట్ల భూదోపిడీ చేశారని తెలిపారు. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, కాంట్రాక్టుల మాఫియా చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మీద ప్రేమతోనే, రాహుల్ మీద ప్రేమతోనే కాంగ్రెస్‌ను గెలిపించలేదని.. కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని బంగారు కుటుంబాన్ని చేసుకున్నారని కేసీఆర్ పై విమర్శలు చేశారు.
Pawan Kalyan: అభిమానులు నాకు ఓటు వెయ్యకపోతే నాకేం నష్టం లేదు..
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!