Pawan Singh: సమయమే సమాధానం చెబుతుంది.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమయమే చెబుతుందని బీజేపీకి చెందిన పవన్ సింగ్ అన్నారు. అసన్‌సోల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని పవన్ కలిశారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నిరాకరించిన పవన్ సింగ్.. సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏది జరిగినా మంచి జరుగుతుందని పేర్కొన్నారు. తాము ఏ అంశంపై చర్చించారో అన్న విషయాలను చెప్పలేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. ఏం జరిగినా మంచి జరుగుతుందని చెప్పారు. దానికి సమయమే సమాధానం చెబుతుంది.. ఏది జరిగినా, తాము ఖచ్చితంగా మీకు చెబుతాము.. కొంచెం ఆగండని తెలిపారు.
CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు.. షెడ్యూల్ ఇదే..!
Also Read
కాగా.. నిన్న బీజేపీ అధిష్టానం త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ క్రమంలో.. భోజ్పురి సింగర్, నటుడు పవన్ సింగ్ పోటీ చేయలేనంటూ భారీ షాక్ ఇచ్చారు. తనకు కేటాయించిన పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయలేనని తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి అసన్ సోల్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే… కొన్ని కారణాల వల్ల నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అని ఆయన ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
Leopard: బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల.. 5 గంటలపాటు నరకయాతన
పవన్ సింగ్ చేసిన ట్వీట్ పై తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పందించారు. ఈ ఉపసంహరణ పశ్చిమ బెంగాల్ ప్రజల అద్వితీయమైన స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. మరో తృణమూల్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ.. అసలు ఆట ప్రారంభం కాకముందే బీజేపీకి దెబ్బ తగిలిందంటూ కౌంటర్ వేశారు. సింగర్, పొలిటీషియన్ బాబుల్ సుప్రియో బదులిస్తూ… పోటీ నుంచి తప్పుకోవాలంటూ పవన్‌పై బీజేపీ ఒత్తిడి చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!