హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దులో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పలువురు యువకులు కూడా పాల్గొన్నారు. అయితే వారికి ఇదొక చేదువార్త అనే చెప్పవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతులను గుర్తించి వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు. అయితే వాటిని ధ్వంసం చేసిన రైతులపై అంబాలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ…
హైదరాబాద్ లోని మైత్రివనంలో ఉన్న HMDAలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్.. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 4, 5వ అంతస్తులో రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ విషయాన్ని విజిలెన్స్ బృందం ఉన్నతాధికారులకు తెలిపారు.
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు…
తమకు ఇష్టమైన ఆటగాళ్ల కోసం అభిమానులు ఏది చేయడానికైనా సిద్ధం అనే విధంగా ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతున్నా సరే.. అక్కడికి వెళ్లి సపోర్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులు ఏ కంట్రీలో మ్యాచ్ జరిగినా వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ మధ్యలో కొందరు అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్ల పేర్లను ప్లకార్డులపై రాసి చూపిస్తారు. వారి మనసులో ఏదనుకుంటారో దానిని ప్లకార్డుపై వ్యక్తపరుస్తారు. నాకు ఈ ఆటగాడు అంటే ఇష్టం, ఇతని బ్యాటింగ్ అంటే ఇష్టం, బౌలింగ్ అంటే ఇష్టం, లవ్…
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అయితే.. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టైం బాగా లేక ఓడిపోయా.. ఓడిపోయినా.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు అని అన్నారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నానని తెలిపారు.
హైదరాబాద్ లోని యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఎంపీ డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇంకా 6 గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో నెరవేర్చలేని…
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కి వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాగా.. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరింది. కాగా.. సీఆర్పీసీ ప్రకారం…
మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కాదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని.. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారని అన్నారు. ఆర్థిక అంశాలు సీఎం రేవంత్, డిప్యూటీ…