BYD Sealion 7: ఒక్క ఛార్జ్‌తో 567 కి.మీ రేంజ్.. అదిరిపోయిన ఫీచర్లు
- BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV లాంచ్
- భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లు విడుదల
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ రేంజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే.. BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారుకు సంబంధించిన ధర, ఫీచర్లు, పరిధి వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం..
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు..
Also Read
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ఫీచర్లు:
సౌండ్ క్వాలిటీ కోసం సూపీరియరైన 12 స్పీకర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వాటర్ డ్రాప్ టెయిల్ లాంప్స్, వెహికల్-టు-లోడ్ (V2L) ఫంక్షనాలిటీ, 15.6 అంగుళాల రొటేటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నప్పా లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్లు, 128-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, భద్రత కోసం వాహనంలో 11 ఎయిర్‌బ్యాగులు.. డ్రైవర్ ఫెటీగ్ మానిటరింగ్ సిస్టమ్ అందించారు.
బ్యాటరీ & రేంజ్:
ఈ ఎలక్ట్రిక్ కారులో 82.56 kWh బ్యాటరీని అమర్చారు. కాగా.. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారులో ఉన్న మోటారు 390 kW శక్తి, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ మోటారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 567 కిలోమీటర్ల NEDC పరిధిని అందిస్తుంది. ఈ వాహనంతో 7KW ఛార్జర్ కూడా అందించనున్నారు. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
ధర & డెలివరీ తేదీ:
BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUVను రూ.48.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరగా విడుదల చేసింది. ప్రీమియం వేరియంట్‌ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ.54.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ వాహనాన్ని 17 జనవరి 2025న విడుదల చేశారు.. కాగా.. 18 జనవరి 2025 నుండి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారు డెలివరీ మార్చి 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 70,000 బుకింగ్‌లు పూర్తయ్యే వరకు మాత్రమే వర్తిస్తుంది. బుకింగ్ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటివరకు 1,000 బుకింగ్‌లు వచ్చాయి.
పోటీ:
BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV ప్రీమియం విభాగంలో ప్రవేశించింది. ఈ విభాగంలో ఇది హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6, BMW iX7 వంటి ఎలక్ట్రిక్ SUVs తో నేరుగా పోటీపడుతుంది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!