సిద్దిపేట జిల్లా మర్కుక్ (మం) వరదరాజ్‌పూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. గతేడాది కవిత జైల్లో ఉన్నప్పుడు బెయిల్ రావాలని వరదరాజ్‌పూర్ హనుమాన్ దేవాలయంలో గ్రామస్తులు ముడుపు కట్టారు. అయితే.. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అక్కడకు వచ్చి ముడుపు విప్పారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన పోయిన 14 నెలల్లోనే తెలంగాణ ప్రజలు నరకం చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ను తలవని గుండె లేదని కవిత పేర్కొన్నారు.
Read Also: Upamaka Venkateswara Swamy Temple: ఉపమాక వెంకన్న ఆలయాభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డివి అన్ని వంకర టింకర మాటలేనని వ్యాఖ్యానించారు. బీసీ లెక్కలు సరిగా లేవు అంటే విషయాన్ని పక్కదోవ పట్టించాలని ప్రధాని మోడీ బీసీ అవునా కదా అనే చర్చ పెట్టాడని దుయ్యబట్టారు. ఇటు బండి సంజయ్, రాహుల్ గాంధీ ఏ మతం అని ఎదురు దాడికి దిగుతారు.. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కవిత ఆరోపించారు. మీ కుట్రలు, డ్రామాలు ఆపి కులగణన సరిగా చేయండని తెలిపారు.
Read Also: Janhvi Kapoor : సౌత్ పై ఫుల్ ఫోకస్ చేస్తోన్న జాన్వీ కపూర్