సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జేపీ డుమినీ (Jean Paul Duminy) విడాకులు తీసుకున్నాడు. 14 సంవత్సరాల సంసార సంబంధానికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. డుమినీ, అతని భార్య సూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని అందులో తెలిపాడు. “ఎన్నో అద్భుతమైన క్షణాలను కలిసి గడిపిన తర్వాత, విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని డుమినీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. “చాలా ఆలోచించిన తర్వాత.. సూ, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము చాలా అద్భుతమైన సమయాలను కలిసి గడిపాము. మాకు ఇద్దరు చిన్న కుమార్తెలు కూడా ఉన్నారు. మేము స్నేహితులుగా ఉంటాము. మా విడిపోవడం స్నేహపూర్వకంగా జరిగింది” అని డుమినీ రాశాడు.
Read Also: Indian Railways: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఎఫెక్ట్.. రైల్వే కీలక నిర్ణయం
డుమినీ, సూ 2011లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి దాదాపు 300 మందిని ఆహ్వానించారు. ఇందులో ప్రముఖ క్రికెటర్లు మోర్నే మోర్కెల్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్ వంటి వారు ఉన్నారు. డుమినీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2018లో డుమినీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడాడు. వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉంది.
Read Also: Moinabad Farmhouse : జడ్డి సమక్షంలో పందెం కోళ్లు వేలం.. రూ.2.50 లక్షలు పలికిన పది కోళ్లు