దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్ సే రాన్ (24) మృతి చెందారు. ఆమె మరణం వార్త విన్న అభిమానులు, ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ద్రిగ్భాంతికి గురవుతున్నారు. కాగా.. ఈరోజు కిమ్ సే రాన్ తన ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మరణానికి సంబంధించిన విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ సే రాన్ మృతదేహం సియోల్ నగరంలోని సాంగ్‌డాంగ్-గులోని తన ఇంట్లో లభ్యమైంది. ఆమె చనిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి సాయంత్రం 4:50 గంటలకు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.. ప్రాథమిక దర్యాప్తులో ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి కారణాలు తెలియలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, నేర కృత్యాలు ఉన్నట్లు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. కిమ్ సే రాన్ మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Guntur: ఇలా చంపుతున్నారేంట్రా.. తెనాలిలో వ్యక్తి దారుణ హత్య..
కిమ్ సే రాన్ మరణంపై పోలీసులు ఓ ప్రకటన చేశారు. “కిమ్ సే రాన్ మరణంలో ఎటువంటి బాహ్య దాడి లేదా నేరపూరిత చర్యలు కనిపించలేదు. ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నాం” అని పోలీసులు తెలిపారు. కిమ్ సే రాన్ తన నటనతో అభిమానులను మంత్రముగ్దులను చేసేది. ఆమె ప్రధానంగా టీవీ షోల్లో కనిపించింది. ‘బ్లడ్‌హౌండ్స్’, ‘లివరేజ్’, ‘మిర్రర్ ఆఫ్ ది విచ్’, ‘టు బి కంటిన్యూడ్’, ‘హై స్కూల్ – లవ్ ఆన్’ వంటి ప్రముఖ డ్రమాల్లో నటించి ఎంతో పేరు సాధించింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కిమ్ సే రాన్ మరణం ఆమె అభిమానులకు, సహచర నటి-నటులకు మరియు చిత్ర పరిశ్రమకి పెద్ద దు:ఖాన్ని కలిగించింది.