మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ట్రోఫీ సాధించిపెట్టిన సారథి ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తారా అనేది రేపటి మ్యాచ్ లో…
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంటరీ చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఐపీఎల్ 2024 సీజన్ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో.. సిద్ధూ ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగలడని చెప్పాడు. ఆట సమయంలో విరాట్ కోహ్లీ వైఖరి, దూకుడు, ఆత్మవిశ్వాసం అద్భుతమని సిద్ధూ పేర్కొన్నాడు.
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే.. మ్యాచ్ కు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంకానున్నట్లు సమాచారం. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో పతిరణకు గాయమైంది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ(NOC) ఇవ్వలేదు.
ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 17 సీజన్ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా.. రేపు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అసలు విషయానికొస్తే.. చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు ఆడుతున్నారు. ఏపీకి చెందిన షేక్ రషీద్, తెలంగాణకు చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో.. ఈసారి తెలుగుకుర్రాళ్లు…
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా…
ఆర్సీబీ (RCB) పేరు మారింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు.
అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జమ్మూలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని కోసమని క్రైమ్ బ్రాంచ్ అనేక నగరాల్లో వెతుకులాట ప్రారంభించి చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
బీహార్‌లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్‌లోని ఆర్మీ బెటాలియన్‌ను బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్‌పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం.. ఎందుకంటే కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. అయితే.. ఇవే కాకుండా ప్రోటీన్స్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం....