Proteins Food: ఈ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ.. తిన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం.. ఎందుకంటే కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. అయితే.. ఇవే కాకుండా ప్రోటీన్స్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం….
బాదం
బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. బాదంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. అంతేకాకుండా.. బాదంపప్పును స్మూతీస్, షేక్స్, సలాడ్లు, పండ్లతో తింటే చాలా మంచిది.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
వేరుశెనగ వెన్న
వేరుశెనగ నుండి తయారైన వేరుశెనగ వెన్నలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. దీనిని ఎక్కువగా బ్రెడ్ మీద రాసుకుని తింటారు. దీనిని ఓట్ మీల్, స్మూతీస్ మరియు షేక్స్ మొదలైన వాటితో కూడా కలిపి తింటారు. అయితే.. వేరుశెనగ వెన్నను ఎక్కువ శాతం తీసుకోకపోవడం మంచిది.. ఎందుకంటే.. శరీరం వేడి బారిన పడకుండా ఉంటుంది.
గుమ్మడికాయ గింజలు
తినే ఆహారంలో విత్తనాలను చేర్చుకుంటే చాలా మంచిది. వీటిల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు అనేక రకాల విటమిన్లు విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి.. బరువు తగ్గించడంలో మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి.
పప్పులు
ఎరుపు, పసుపు, నారింజ, నలుపు, ఆకుపచ్చ మరియు గోధుమ పప్పులలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పప్పులను అన్నంలో ఎక్కువగా తింటారు. పప్పులు తినడం వల్ల శరీరానికి మంచి ప్రొటీన్లు అందుతాయి. కేవలం అరకప్పు పప్పుల నుండి శరీరానికి 8 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది.
చిక్పీస్
ప్రోటీన్లు పొందడానికి చిక్పీస్ కూడా తినవచ్చు. చిక్పీస్ లో ఇనుము, ఫాస్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ K కలిగి ఉంటుంది. ఇది తినడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. అందుకోసమని రోజూ తినే ఆహారంలో చిక్‌పీస్‌ను చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!