మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ట్రోఫీ సాధించిపెట్టిన సారథి ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తారా అనేది రేపటి మ్యాచ్ లో తెలువనుంది.
EC Action: ఎన్నికల వేళ కొనసాగుతున్న బదిలీల వేట.. ఈసారి ఏ రాష్ట్రాలంటే..!
ఐపీఎల్ చరిత్రలో గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకరైన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 2 ట్రోఫీలు అందించి పెట్టాడు. మరోవైపు.. సీఎస్కే జట్టు తరుఫున 13 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించగా.. 10 సార్లు ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ గా 226 మ్యాచ్ ల్లో 133 విజయాలు, 91 ఓటములు ధోనీ ఖాతాలో ఉన్నాయి. ఇకపోతే.. కెప్టెన్ గా చివరిసారిగా ఐపీఎల్ 2023లో ట్రోఫీ సాధించాడు.
Navjot Singh: టీమిండియా బ్యాటర్లలో టాప్ ప్లేయర్ అతనే..
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ట్రోఫీతో ఆయా ఫ్రాంచైజీల కెప్టెన్లు ఫొటో షూట్ నిర్వహించారు. ప్యాట్ కమిన్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్), హార్దిక్ పాండ్యా (ముంబయి ఇండియన్స్), ఢిల్లీ క్యాపిటల్స్ (రిషబ్ పంత్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), గుజరాత్ టైటాన్స్ (శుభ్ మాన్ గిల్), ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), శ్రేయాస్ అయ్యర్ (కోల్ కతా నైట్ రైడర్స్) ఈ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ ఫొటో షూట్ లో పాల్గొన్నారు.