అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జమ్మూలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని కోసమని క్రైమ్ బ్రాంచ్ అనేక నగరాల్లో వెతుకులాట ప్రారంభించి చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Bihar: పట్టాలు తప్పిన ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలు..
నిందితుడిని షెరాజ్ మీర్‌గా గుర్తించారు.. అతను జమ్‌కాష్ వెహిడ్జే వద్ద అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే.. అతను చాలా తెలివిగా తన బ్యాంకు ఖాతాలకు కంపెనీ నిధులను బదిలీ చేసుకునేవాడు. అలా.. దాదాపు రూ.1.32 కోట్ల మొత్తాన్ని తన ఖాతాల్లోకి పంపించుకున్నాడు. ఆ తర్వాత నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం ఆరోపణలపై అరెస్టయ్యాడు.
Sharad Pawar: సుప్రీంకోర్టులో శరద్ పవార్‌కు ఊరట
ఈ ఘటనపై సమాచారం ఇస్తూ.. జామ్‌క్యాష్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్రాతపూర్వక ఫిర్యాదుపై జూలై 19, 2022 న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా.. నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు తన ఖాతాకు పంపిన సొమ్మును ఉపయోగించినట్లు విచారణలో తేలింది.