CSK: మ్యాచ్కు ముందు చెన్నైకి భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే.. మ్యాచ్ కు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంకానున్నట్లు సమాచారం. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో పతిరణకు గాయమైంది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ(NOC) ఇవ్వలేదు.
IPL 2024: చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
కాగా.. సీఎస్కేకు సీజన్ ప్రారంభంలో రెండోదెబ్బ తగిలినట్లైంది. ఇంతకు ముందు సీఎస్కే ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. అయితే.. అతని స్థానాన్ని భర్తీ చేయడం సులువే అయినప్పటికీ, పతిరణ స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్కేకు తలనొప్పిగా మారింది. ఇకపోతే.. కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ ముస్తాఫిజుర్ కూడా కావడంతో సీఎస్‌కే యాజమాన్యం అతన్ని జట్టులోకి తీసుకునేందుకు సై అనేలా అనిపిస్తుంది.
Lok Sabha Elections 2024: ఏడు దశాబ్ధాల ఎన్నికల చరిత్రలో 14 నుంచి 6కి తగ్గిన జాతీయ పార్టీలు..
మరోవైపు.. మెయిన్ అలీ ఆల్ రౌండర్ కావున అతన్ని కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ ధోనీ, బౌలింగ్ కోచ్ బ్రావో శార్దూల్ ఠాకూర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రేపు.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!