Kakarla Suresh: ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ పాతుకుపోయిన మేకపాటి కుటుంబం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని.. అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమన్నారు. త్రాగు సాగునీరు తీసుకొస్తామని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆచరణ శూన్యమని ఆరోపించారు. ఇక్కడ ఎన్నారైలే కాదు.. ఎన్ఆర్యూలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత కమిటీని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని.. అంటే ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాల కాలం ముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. అంతకుముందే ఆరు నెలల కాలం 8 మండలాల్లో కావలసిన వనరుల గురించి సర్వే చేయించుకోవడం జరిగిందన్నారు. వాటి ఆధారంగానే ట్రస్టు ద్వారా 17 కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు లక్ష మందిని కలుసుకోవడం జరిగిందన్నారు.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
CSK: మ్యాచ్కు ముందు చెన్నైకి భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
ఎంతోమంది అభాగ్యులను ఆదుకున్నామన్నారు కాకర్ల సురేష్. సుమారు 30 వేల మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి విలువైన మందులు అందజేయడం జరిగిందన్నారు. ఎంతోమందిని గుండె సంబంధిత వ్యాధులనుండి కాపాడమన్నారు. అదేవిధంగా ప్రతిరోజు 600 నుండి 700 వరకు అన్నా క్యాంటీన్ ద్వారా వింజమూరులో ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఓడిపోతానని అర్థమై అర్థరహితమైన ఆరోపణలు పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. వీటిని క్రమశిక్షణ కలిగిన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని ఘంటా పదంగా చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తానని హెచ్చరించారు.
2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని కాకర్ల సురేష్ తెలిపారు. లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నష్టపోతారని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకోవాలన్నారు. వచ్చే ప్రభుత్వం తెలుగుదేశందే కాదని.. జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని.. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు. అదే విధంగా.. నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికీ సుపరిచితులని.. ఈ ప్రాంతానికి ఆయన ఎంతో చేశారని, ఫ్లోరైడ్ బారి నుండి ఎన్నో కుటుంబాలను కాపాడిన నేతగా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కనుక అటువంటి నాయకుడిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుపై ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ప్రార్థించారు.
Supreme court: తమిళనాడు గవర్నర్ తీరుపై మండిపడ్డ ధర్మాసనం
అంతకుముందు.. ఉదయగిరి ట్యాంక్ బండ్ నుండి టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైకు ర్యాలీ నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో గజమాలతో కాకర్ల సురేష్ చంచల బాబు యాదవ్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాల వారిగా నాయకులు కాకర్ల సురేష్ ను పరిచయం చేసుకుంటూ శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు, ఉదయగిరి మాజీ సర్పంచ్ ఎస్కే రియాజ్, మాజీ జడ్పిటిసి సభ్యులు కలివేల జ్యోతి, మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, ఎల్సీ రమణారెడ్డి, దేవ ప్రసన్న, ముట్టుకుందు వెంకటరెడ్డి ప్రభాకర్, వేగుపాటి రామయ్య, సందాని బొబ్బలి శ్రీనివాసులు, మతకాల శ్రీనివాస్ యాదవ్, లోకసాని రవికుమార్ రెడ్డి, బత్తిన వెంకటేశ్వర్లు, ఆండ్రా పరంధామిరెడ్డి, అబ్రహం, చీపినాపి రాగయ్య, కర్ణాటక కొండలరావు, గడ్డం వెంకటేశ్వర్లు, అడుసుపల్లి వెంకటసుబ్బయ్య, కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామ మహేశ్వరరావు, జనసేన నాయకులు ఉదయగిరి ఇన్చార్జి రాష్ట్ర కమిటీ నెంబర్ బోగినేని కాశీరావు, జిల్లా కార్యదర్శి ఆలూరు రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కొల్లూరు సురేందర్ రెడ్డి, ఉదయగిరి నాయకులు కుర్ర కృష్ణ యాదవ్, సీతారాంపురం మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉదయగిరి మండల నాయకులు పసుపులేటి తిరుపతయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!