విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేయడం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆ విషయం తాను మీడియాలో చూసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం అవకాశమిస్తే.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. రేపు సాయంత్రం కల్లా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్ది సేవ చేశానని…
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తన మొదటి గెలుపును నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. చివరలో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు మహిపాల్ లోమ్రార్ కూడా కేవలం 8 బంతుల్లో 17 పరుగులు చేయడంతో బెంగళూరు గెలుపు…
టీ 20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో అత్యధికంగా 50 ప్లస్ రన్స్ చేసిన తొలి టీమిండియా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లోనే అత్యధిక క్యాచ్ లు (173) అందుకున్న భారత ఆటగాడిగాను అవతరించారు. బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ తర్వాత…
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్-రాయల్స్ ఛాలెంజర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆర్సీబీ లక్ష్యం 177 పరుగులు చేయాల్సి ఉంది. పంజాబ్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ (45) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (8) అనుకున్నంత రాణించలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ (25), లివింగ్ స్టోన్ (17)…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరి మండల కేంద్రంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకర్ల సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్…
ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని పలు పెళ్లి వేడుకల్లో ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం జమ్మల పాలెంలో ఉన్నటువంటి ఎస్విఆర్ కళ్యాణ మండపంలో కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బొల్లా హనుమంతరావు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చరణ్, వినీల వివాహ మహోత్సవంలో కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది.. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇపుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నపుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించానన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నపుడు కూడా చెప్పానని తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. కాసేపట్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రంగుల పండుగ రోజున వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. రెండు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ముగ్గురు చనిపోతే, సరదాగా ఈతకెళ్లి మరో చిన్నారి మృతి చెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.