విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేయడం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆ విషయం తాను మీడియాలో చూసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం అవకాశమిస్తే.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. రేపు సాయంత్రం కల్లా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Heatwave: పెరుగుతున్న వేసవి ఎండలు.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు..
విజయవాడలో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, సత్యకుమార్, విష్ణువర్థన్ రెడ్డి హాజరుకాలేదు. అభ్యర్థుల ఎంపిక బీజేపీలోని పాత, కొత్త నేతల మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే వారు మీటింగ్ కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వ్యక్తిగత కారణాల వల్లే కొందరు హాజరు కాలేదు.
Read Also: Arvind Kejriwal Arrest: జర్మనీ దారిలోనే అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు..
కాగా.. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో.. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ బీజేపీ.. ఇక, ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించారు.